Part Time Jobs

Part Time Jobs Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Part Time Jobs, Hyderabad.

12/12/2017
12/12/2017
ఇంకా మంచి చిట్కాల కోసం మా పేజి లైక్ చేయండి
05/12/2017

ఇంకా మంచి చిట్కాల కోసం మా పేజి లైక్ చేయండి

05/12/2017
05/12/2017

అమ్మకు ముద్దు పెడుతూ ఈ బాబు ఎంత ఆనందపడుతున్నాడో చూడండి..❤️❤️ LIKE & SHARE

నిన్న సంతలో తెల్లగలిజేరు ఆకు కొన్నాక '' ప్రతివారం గలిజేరు ని మాత్రం వదలకుండా అడుగుతారెందుకు ''అన్నది అమ్మే అమ్మాయి. రెట్...
05/12/2017

నిన్న సంతలో తెల్లగలిజేరు ఆకు కొన్నాక '' ప్రతివారం గలిజేరు ని మాత్రం వదలకుండా అడుగుతారెందుకు ''అన్నది అమ్మే అమ్మాయి.
రెట్టించిన ఉత్సాహం తో,ఆవేశంతో వర్షం పడుతున్నా పట్టించుకోకుండా గలిజేరు కధ చెప్పి వచ్చాను .''ఈ గుణాలన్నీ విన్నాక రేపటి నుండి దీని ధర మాత్రం పెంచేయకు'' అన్నాను చివర :-)
పక్కన ఉండి ఇదంతా విన్నావిడ , ''ఇవన్నీ ముందే తెలిస్తే ఈమెకి మిమ్మల్ని ఈ సంగతులు చెప్పనిచ్చేదాన్ని కాదు ఎందుకంటే సాటి మనిషి అవసరానికి సాయపడే లక్షణం తగ్గి వ్యాపారం చేసుకునే లక్షణం ఈ కాలపు మనుషులకి పెరిగింది కదా అందుకని ''అన్నది నవ్వుతూ .
మొక్క గురించి నేను చదివిన,విన్న, తెలిసిన నాలుగు విషయాలు ..
వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు . కొన్ని మూలికల గురించి చదువుతూంటే భగవంతుడు ఎంత దయామయుడు అనిపిస్తుంది . అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని , ఔషధాలను అతి దగ్గరగా , సులువుగా , చవకగా ఉంచినందుకు . ప్రకృతిని నాశనం చేస్తూన్న మనిషికి తనని తాను నాశనం చేసుకుంటున్నాడన్న స్పృహ ఎప్పుడు కలుగుతుందో అనిపిస్తుంది . ఆరోగ్యం లేని ధనం , జీవితం , ఆయుష్షు ఎవరికి, ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి .
మన మొక్క విషయానికి వస్తే ,దీన్ని పునర్నవ అని కూడా అంటారు . ఆయుర్వేద మందుల్లో anti inflammatory గా , anti oedema (ఒంట్లో నీరు చేరటం ) ముందుగా వాడే పునర్నవాసవం , రక్తాన్ని వృద్ది పరచటానికి వాడే పునర్నవ మండూరం తయారు చేసేది ఈ మొక్కతోనే .
వర్షాభూ అని కూడా అంటారు . వర్షా కాలం లో మొలిచేది కాబట్టి .ఇంగ్లీష్ లో boerhavia diffusa .నేల మీద పాకే ఈ మొక్క మూడు రకాలు.తెలుపు , ఎరుపు , నలుపు. ఔషధ గుణాలు మూడింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు .వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు.
తెల్ల గలిజేరు వేడి చేసి , కఫము ,దగ్గు ,విషము ,హృద్రోగాలను ,పాండు రోగాలు , శరీరానికి కలిగే వాపులు , వాత వ్యాధులు , కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది . లివర్ వాపు ని , గుండె బలహీనత వల్ల వఛ్చిన వాపుని పోగొడుతుంది . కిడ్నీ లను బాగు చేసి సక్రమం గా పని చేసేలా చేస్తుంది . బాగా ముదిరిన ఈ మొక్క వేరులను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి చేసి బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి , పాండు రోగము , శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి , వాతము , కఫము , ఉబ్బు పోగొడుతుంది .
నెల రోజులు తింటే కుష్ఠుని కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది . ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి , కంటి చూపు మెరుగు పడుతుంది . ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది . ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం , సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి . అలా మూడు రోజులు తినాలి .
ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి . గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి , వాతం నొప్పులున్న చోట , కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి . నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు . గలిజేరు ఆకు రసం తీసి సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి ఉంచాలి . రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగితే గుండె దడ , గుండె బలహీనత తగ్గుతాయంటారు
శరీరాన్ని detoxify చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది . శరీరం లో యూరియా లెవెల్స్ ని తగ్గిస్తుంది . diuretic గా పని చేస్తుంది . గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది .
ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది . నల్ల గలిజేరు కారం , చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది . ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె .
పప్పులో కలిపి వండుకుంటారు , ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండి లో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు . ఆకుల తో కషాయం చేసి తాగుతారు . ఈ కషాయం లో కొద్దీ గా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది .
తెల్ల గలిజేరు వేరు , ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది.
తెల్లగలిజేరు వేరు , నీరు , పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది .
ఈ ఆకు కూరని అతిగా తినకూడదు . తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి .diabetes , అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధికం గా తింటూ ఈ ఆకు కూరని మితం గా తినాలి . ఈ ఆకుతో చేసిన మందులు మాత్రం పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే వాడాలి . lactating తల్లులు , గర్భిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలం లో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది . చాలా త్వరగా కిడ్నీ ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే 'పునర్నవ' అయ్యింది

05/12/2017

రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా ఇది తెలుసుకోవాలి మీరు!

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Part Time Jobs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Part Time Jobs:

Share