GuruDarshan Ramashram Satsang, Mathura

GuruDarshan Ramashram Satsang, Mathura Guru Darshan is a community of followers of Ramashram Satsang, Mathur.

The community focuses on meditation and the content of the masters of their lineage in vernacular languages.

30/03/2022

గురు అష్టకం
శ్లోకం గురుం ప్రశాంతం భవ భీతి నాశం విశుద్ధ బోధం కలుశాపహారం |
ఆనంద రూపం నయనాభి రామం శ్రీ సత్య దేవం నితరాం నమామి||
భావార్థము –(బాహ్య ఉపాధులతో నిర్లిప్త అవడం వలన )ఎవరైతే పరమ శాంత వంతుల, విశ్వము యొక్క భయాన్ని నశిన్చేవారో, కేవలం అత్యంత పరిష్కృతమైన అంతః కరణము ఉన్న వాళ్ళ ద్వారానే బోధగమ్యులో, సమస్త పాపాలను హరిన్చేవారో మరియు ఆనంద స్వరూపులో మరియు (సాకారులు అవడం వలన ) నేత్రాలకు ప్రియమనిపించేరు, ఇలాంటి సత్య దేవులుకి నేను అనన్య భావము తో ప్రణ మిస్తాను.
శ్లోక౦-అజ్ఞాన నాశం నిత్య ప్రకాశం సత్ చిట్ స్వరూపం జగదేకమూర్తిం |
విశ్వాశ్రయం విశ్వపతిం పరేశం, శ్రీ సత్య దేవం నితరాం నమామి ||
భావార్థము- ఎవరైతే అజ్ఞానాన్ని నశించే వారో, నిత్యమైన ఆత్మ యొక్క ప్రకాశాన్ని కలిగించేవారో, సత్, చైతన్య స్వరూపులో, ఈ విశ్వము యొక్క ఏక మాత్రమైన ప్రతిభో ( సంపూర్ణ విశ్వము వారిలోను లీనమై ఉన్నదో , లేక విశ్వాన్ని తన లోను ఇమిడ్చి పెట్టుకున్నారో ) (మరియు ఎవరైతే ) విశ్వము యొక్క ఆశ్రయ భూతులో (సమస్త జీవులు ఎందులోనైతే ఆశ్రయము పొందుతాయో ) , ఎవరైతే అఖిల బ్రహ్మాండము యొక్క స్వామియో మరియు సర్వశక్తి మంతులో ఆ (అలాంటి) సత్య స్వరూపులైన గురు దేవునికి నేను నమస్కరిస్తాను.
శ్లోకం స్వయంభువం శాంతమనంతమాద్య౦ బ్రహ్మాదివంద్య౦ పరమేష పూజ్యం |
కాలాత్మకం కాలభువం శరణ్యం , శ్రీ సత్య దేవం నితరాం నమామి||
భావార్థం- ఎవరైతే స్వయంభూ (స్వేచ్చగా ఆకారాన్ని ధరించే వారో) శాంతవంతులో అంతు రహితులో మరియు అన్ని౦టి కీ ఆది కారాకు లో బ్రహ్మాది దేవతల ద్వారా వందనీయులో ,అందరి స్వామి మరియు పూజనీయులో, కాలస్వరూపులో (ఎందులోనైతే మూడు కాలాల సమాహారం అయ్యి ఉన్నదో)
ఇంతే కాదు, నిస్సీమ కాలమే ఎవరిదైతే వ్యాపక శరీరమో , మరియు ఎవరైతే సమస్త ప్రాణులకు ఆశ్రయ స్వరూపులో,ఆ సత్యస్వరూపులైన గురువుకి నేను అనన్య భావముతోనమస్కరి స్తాను .
శ్లోకం అణు౦ మహాంతం సదసత్ పరంచ ,యోగైకగమ్యం కరుణావతారం| సదా వసంతం హ్రుదయార విందే ,శ్రీ సత్య దేవం నితరాం నమామి ||
భావార్థము ---ఎవరైతే అణువు కన్నా సూక్ష్ములో, మహాన్ సత్- అసత్ (అస్తి-నాస్తి) రెండిటలకన్నా మించినదో, (మరియు) చాలా కష్టాన్న బోధ గమ్యులు అయినా కానీ , అతి శీఘ్రముగా కరుణ వలన వశీభూతులై ద్రవించి పోతారో , కేవలం సమాహృత యోగము (తాత్పర్యం చిత్త వృత్తి నిరోధము) ద్వారా నే లభి౦పబడతారో (ఇలాంటి)సత్య స్వరూపులైన గురుదేవునికి నేను అనన్య భావముతో నమస్కరిస్తాను.
శ్లోకం-భోగాపవర్గం ప్రతిదాన శక్తుం, బంధుం సఖాయం, సుహృదం ప్రియంచ |
శాంతి ప్రదానం భవదు:ఖ హీనం శ్రీ సత్యదేవం నితరాం నమామి ||
భావార్థము –ఎవరైతే భోగము మరియు మోక్షము (రెండూ) ప్రసాదించడానికి సమర్థులో , ప్రాణుల యొక్క నిస్వార్థ బంధు, సఖ, సుహృద, మరియు ప్రియులు (మరియు) జీవులకు శాంతి ప్రసాదిన్చేవారో, ఎవరైతే స్వయంగా సంసార దు:ఖాల తో ముక్తులో,( తాత్పర్యం) దు:ఖాతీతులో(ఇలాంటి) సత్య స్వరూపులైన గురువులకు నేను అనన్య భావము తో నమస్కరిస్తాను.
శ్లోకం- ప్రేమామ్బుధిం ప్రేమ రసాయనంచ ,ప్రేమ ప్రదానం నిధిమద్వితీయం|
మ్రుత్యు౦జయం మృత్యు భయాపహారం శ్రీ సత్య దేవం నితరాం నమామి ||

భావార్థము -- ఎవరైతే ప్రేమ యొక్క సాగరులో తాత్పర్యం ఎవరి స్మరణ వలెనే సాధకుడి హృదయము ప్రేమమయము అయిపోతుందో, దేవుడి యొక్క ప్రేమను (భక్తి ) కలిగించేదో , ఏదైతే భక్తుల యొక్క అద్వితీయమైన నిధియో మరియు ఎవరైతే ప్రతిచోటా , సర్వత్ర ఉన్నారో, ఎవరైతే మృత్యువు ని గెలిచేవారో మరియు (సాధకుల ) మృత్యు భయాన్ని దూరము చేసేవారో (ఇలాంటి) సత్యస్వరూపులైన గురుదేవు చరణాలకు నేను నమస్కరి స్తాను.
శ్లోకం-జ్యోతిర్మయ౦ పూర్ణ మనంతశక్తిం సంసార సారం హ్రుదయేశ్వరంచ |
విజ్ఞానరూపం సకలార్తి నాశం శ్రీ సత్యదేవం నితరాం నమామి ||
భావార్థము –ఎవరైతే జ్యోతిస్వరూపులో అన్ని విధములగానూ పూర్ణులో ,
అనంత శక్తులతో పరిపూర్ణులో, సంసారము యొక్క ఏక మాత్రమైన సారమో,
భక్తుల హృదయాల ఏకఛత్ర స్వామియో ( ప్రేరకులు ) మరియు ఎవరైతే జ్ఞాన –విజ్ఞాన మూర్తులో సమస్త జీవుల పీడను హరించే వారో (ఇలాంటి )
సత్య స్వరూపులైన శ్రీ గురు దేవునికి నేను అనన్య భావముతో నమస్కరిస్తాను .
శ్లోకం-- స్నేహం దయాం వత్సలతాం విధాయ , చిత్తం ప్రముగ్ధం క్రుతమత్రయేన|
తమ్ దీననాథం భవసింధుపోతం శ్రీ సత్య దేవం నితరాం నమామి ||
భావార్థము –ఎవరైతే (నాపై) స్నేహము , దయ , మరియు వాత్సల్యము (మమత్వము ) చూపించి నా చిత్తాన్ని మోహింప చేసేరో (మరియు ఎవరైతే) దీనుల యొక్క నాథులో , మరియు సంసార సాగరమును దాటించే నావ రూపాన్ని ధరించిన వారో, ఇలాంటి సత్య స్వరూపులైన శ్రీ గురు దేవునికి నేను అనన్య భావముతో నమస్కరిస్తాను
*******

29/03/2022

#19 శంక నివారణ

ధ్యానము చేస్తే ఏదైతే సత్వగుణ ప్రధానమైన స్థానమో, ఇది ప్రేమ యొక్క స్థానము, ఇచ్చట నుండి ప్రేమయొక్క ధార ప్రవహిస్తుంది, ఇందుకే మేము ఏమంటామంటే హృదయానికి క్రింద ఏ స్థానము అయితే ఉందో అచ్చట నుండి ధ్యానము మొదలు పెట్టండి అని, తరువాత ఏమి జరుగు తుందో దాన్ని జరగనివ్వండి. మనము ఆలోచించేది ఏమిటంటే గురుమహారాజ్ గారి శక్తి మన హృదయాలలో నిండుతోంది మనము దానితో ప్రకాశింప బడుతున్నాము . ముఖ్యముగా ఒక మాట గుర్తుంచుకునేది ఏమిటంటే సాధన చేస్తున్నప్పుడు ఏ ఒత్తిడి పనికిరాదు, pressure ఉంటే అది హాని చేస్తుంది. గురువుగారు ధ్యానము చేస్తున్నప్పుడు చాలా సహజముగా కూర్చోవాలి , ఏ ప్రయత్నమూ చేసే పని లేదు, జపము, ప్రాణాయామము లాంటి ఏ కఠినమైన పనీ ఇవ్వలేదు, చాలా సహజముగా నా ముందు కూర్చోండి , మీ మనస్సుని ధ్యానములో పెట్టడము, అచ్చట నుండి ముందుకి తీసుకు వెళ్లడము నా పని అని అన్నారు. ఎంతవరకూ అన్నారంటే మీలోశ్రద్ధ ఉన్న లేకపోయినా, మీకు ఏమి తేడా పడదు, సహజముగా కూర్చోవడమే మీ పని, మీరు దృష్టా(చూసేవారు) అయిపోండి, చూస్తూ ఉండండి అంతే, మా గురువు గారు కూర్చున్నారు నేను కూర్చున్నాను అంతే, మీరు ధ్యానము చేయ్యక్ఖర్లేదు, శ్రద్ధ విశ్వాసము తీసుకు రావడము నా పని, చెడు ఆలోచనలను ఆపడము, మంచి ఆలోచనలకొరకు ప్రయత్నము ఏమీ చెయ్యక్ఖర్లేదు, ఆలోచనలు మంచివి లేక చెడువి, వచ్చినా, ఏమి జరుగుతూన్న వారే చూసుకుంటారు . pressure అస్సలు ఉండకూడదు, దాని వలన తల భారము అవుతుంది. చాలా సహజముగా కూర్చోవాలి ఏ pressure వద్దు దాని వలన సమస్యలు వస్తాయి, సాధన చేస్తున్నప్పుడు pressure అనిపిస్తే కళ్ళు తెరిచి మరలా మొదలు పెట్టండి, దీనివలన ప్రెషర్ పోతుంది మీరు శాంతముగా కూర్చుండి పోతారు.

29/03/2022

#18 శంక నివారణ

ముఖ్య శిష్యుడిలో మరియు గౌణ ( సాధారణ ) శిష్యుడిలో భేదము ఏమిటి?

ముఖ్య మరియు సాధారణ శిష్యుడిలో ఏమీ తేడా లేదు, గురు శిష్యుల మధ్య ఉండవలసిన సామీప్యత లోపం అంతే. ఎలాగైతే మీ సామీప్యత పెరుగుతుందో అలాగే మీరు ముఖ్య శిష్యులు అయిపోతారు, దూరము ఉంటే మీరు గౌణ శిష్యులు అయిపోతారు. సాధన దాని కొరకు ఒక ప్రక్రియ. సాధన ద్వారా దగ్గరకి చేరుతూ -చేరుతూ మీరు ముఖ్యులు అయిపోయి, వారిలో కలిసిపోవాలి అంతే. సాధన చేస్తూ చేస్తూ మీరు వారిలో కలిసిపోతారు, సాధన ద్వారా మనము ఏమి చేస్తాము అంటే, మన బుద్ధిలో, అహంలో, కారణలో, గురువుని నింపుకుంటాము. శరీరము యొక్క ప్రతి భాగములోనూ గురువు నిండిపోతారు, ‘నేను’ అనేది తొలగి గురువు నిండిపోతారు. మీ మాట, మీ వ్యవహారము గురువుదే అయిపోతుంది. పరమ పూజ్య విరల్ జీ ఇదే అనేవారు అడగకుండ లాక్కొండి . ఎవరైతే గురువుని, అంతరాలలో నింపేసుకుంటారో వారే ముఖ్యులు, నింపుకోనివారు గౌణులు అయిపోతారు, వారే ‘గురుముఖ్ వారే ‘గురుమయము’ అయిపోతారు. మిగిలిన వారు సాధారణ శిష్యులుగా ఉండిపోతారంతే. మనము సాధన కొరకు కూర్చున్నప్పుడు చెయ్య వలసినది ఇదే. మనము గీత లో చదువుతాము, సాధారణ శిష్యుడు అంటాడు- “శిష్యస్తేsహం తవాం ప్రపన్నం”

ఇంత తో పని జరగదు, దీపము ఉంటే మరి చీకటి ఎందుకు? దీపము లేదు అన్నమాట అందుకే చీకటి.

ప్రకాశాన్ని మీ లో నింపుతూ ఉండండి. ఇది ఒక చాలా చక్కటి సంయోగము ఈ సత్సంగము మనకి దొరికింది, దీని మహత్వాన్ని మనము తెలుసుకోలేక పోతున్నాము. చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో కానీ ఎంత శాంతి? ఎవరూ ఎవరినీ శాంతముగా ఉండండి అని అనరు, ఎంత విచిత్రము? ఎంత శాంతి! ఇది గురు మహారాజ్ గారి అనుపమైన బహుమతి. ఈ సంసారములో ఇలాంటి మరొక స్థానము లేదు ఎక్కడైతే ఇలా శాంతి కు రుస్తుందో, అందరికీ ఆశ్చర్యముగా అనిపిస్తుంది, ఇచ్చట ఎంతమంది వస్తారో కానీ ఇంతమంది వచ్చినట్లు తెలియనే తెలియదు. (Tundla)“టూన్డలా భండారా” జరుగుతూన్నప్పుడు చాలా మంది పోలీస్ వాళ్ళు అచ్చట ఉంటారు, అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అన్నారు- మేము ఇచ్చట ఏమి చెయ్యము? ఇచ్చటైతే వ్యవస్థ అంతా చాలా బాగుంది, ఇచ్చట మా అవసరమే లేదు, అంతా శాంతిమయంగా ఉంది, ఇదంతా గురువు గారి కృప. ఇది మన సౌభాగ్యము, ఇది మనకి దొరుకుతోంది. ఇదంతా ఒక చక్కటి సంయోగము, మా అందరిపై దయ చెయ్యండని గురుమహారాజ్ గారి తో ప్రార్థన.

28/03/2022

#17 శంక నివారణ –

నేను సరైన పద్ధతి లో ధ్యానము చేస్తున్నట్లు నాకు ఎలా తెలుస్తుంది?

సాధనలో నాకుఇప్పట వరకు ఏ అనుభవము కలగ లేదు. నేను చాలా సంవత్సరాల నుండి సత్సంగానికి వస్తున్నాను, చాలా ఏళ్ల వరకూ మన సత్సగము లో ఉన్నవేరే -వేరే మహాపురుషుల ధ్యానము చేస్తూ ఉన్నాను కానీ, నాకు ఏ అనుభవము అవలేదు, ఏ ప్రకాశము కనబడలేదు. కొన్ని ఏళ్లు ప్రకాశము యొక్క ధ్యానము చేశాను, అప్పుడూ ఏమి అనుభవము అవ లేదు, ఇంక ఇప్పుడు 5 సంవత్సరాల నుండి ఎవరినైతే గురుగా భావించానో వారి ధ్యానము చేస్తున్నాను, ఇప్పటికీ నాకు ఏ ధ్వని వినిపించలేదు, ఏ అనుభవము కలగ లేదు. నేను చేసినది అంతా వృథా అ యినట్లేనా? లేక నేను ధ్యానము యొక్క ఒక formality మాత్రమే పూర్తి చేస్తున్నానా?



ఈ రామాశ్రమ్ సత్సంగము ఒక Ideology

( భావజాలము).ఇది ఒక మహాపురుషుడి విచారాధార, ఎవరినైతే మనము పరమాత్ముడు అంటామో, ఎవరినైతే మనము గురు మహారాజ్ అంటామో. ఎందరో మహాత్ములు ఇందులోకి వచ్చారు అందరి ప్రయత్నము ఇదే ఉండేది ఆ ideology ని ఇంకా స్పష్టపరచడము, ఇంకా సరళముగా చేయడము, కానీ వేరే ఏ విచారాధారా ఇవ్వలేదు మునుపటి ఆ విచారధారతోనే ముందుకి వెళ్తున్నాము ఏదయితె గురు మహారాజ గారు ఇచ్చారో. పని చేసే వారు చాలా మంది వస్తారు, ఇప్పటి వరకూ వచ్చేరు, ఇక ముందూ వస్తారు, కానీ ideology అదే ఉండాలి దేనివల్లనైతే ఇందులో ప్రగతి అవుతుందో మరియు అందరి కి మంచి జరుగుతుందో, అందుకే మా అందరి ఆలోచన ఇదే ఉండేది,ఇది ఎలాగైతే ఉందో అలాగే ఎప్పటికీ నడుస్తూ ఉండాలని, పెద్ద మార్పు రాకుండా ఉండాలని. మీరు ఇప్పటివరకూ ఏ ధ్యానమైతే చేశారో, ఇందులో ముఖ్యమైన ఒక విషయము ఏమిటి ఉంటుందంటే మనకు ఒక ఇష్టుమైన వ్యక్తి ఉండాలి, గురువుగా భావించినా దేవుడుగా భావించినా ఏదో ఒక రూపాన్ని మీ ఎదుట నిలుపుకోండి , వారు గురువు అయిన లేక ఈశ్వరుడైన, తరువాత వారి శరీరము ఉన్నా లేకపోయినా, మీరు వారి ధ్యానమే చేస్తూ ఉండండి. ఎలాగైతే నేను చెప్పానో మనుషులు మారుతూనే ఉంటారు, కానీ శక్తి గురు మహారాజ్ గారిదే ఉంటుంది, విచార ధారా అదే ఉంటుంది, ఏదైతే అయిపోయిందో అది ఎలాగా అయిపోయింది కానీ, మీరు ఇప్పుడు ఎవరి ధ్యానమైతే మొదలు పేట్టేరో వారిదే చేస్తూ ఉండండి. మనకి ఏమి అనుభవము అవుతోందంటే మనము ఇచ్చటకి వస్తున్నాము, మీరూ వస్తున్నారు మేము వస్తున్నాము, ఇచ్చట మనము ఏదో పొందుతున్నాము కదా! అందుకే వస్తున్నాము, లేకపోతే ఎవరూ రారు. గురు మహారాజ్ గారి విచార ధార ముందు ఎలా పని చేసేదో ఇప్పుడూ అలాగే పని చేస్తోంది. నమ్మకము ఏమిటంటే భవిష్యత్తులో కూడా పని చేస్తూ ఉంటుంది. అనుభవము అవడము అవ్వకపోడము ఒక లెక్క కాదు. ఒక మహాత్ముడు ఉండేవారు వారికి చాలా మంది శిష్యులు ఉండేవారు, అందరూ వచ్చి అనేవారు నాకు ఈ రోజు ఈ అనుభవము అయింది, నేను ఈ అవస్థ కి చేరేను అని. ఒక శిష్యుడు ఎలాంటి వాడు ఉండేవాడు అంటే ఎవరికైతే ఏ అనుభవము కలగలేదో. ఒక రోజు గురువు గారు ఏకాంతములో ఉన్నప్పుడు అతడు, వారి దగ్గరకి వెళ్ళి అడిగాడు – గురువు గారూ! ఇన్ని సంవత్సరాలనుండి నేను వస్తున్నాను నాకు ఏ అనుభవము కలగడము లేదు అని ఏడవడం మొదలు పెట్టాడు. తక్కిన శిష్యులందరూ మీ తో వాళ్ళ -వాళ్ళ అనుభవాలు పంచుకుంటూంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, గురువుగారు అన్నారు పరవాలేదు. రేపు పొద్దున్న మీరు అడవికి వెళ్లీ , ఏదో ఒక మంచి స్థానము చూసి ధ్యానానికి కూర్చోండి. అతడు అలాగే చేశాడు , తిరిగి గురువు గారి దగ్గరకి వెళ్ళాడు, వారు అడిగేరు అచ్చట ఏమి చూశావు? ధ్యానము చేసిన చోట ఒక కాకి జంట చూశాను, సరే రేపు మళ్ళీ వెళ్ళి అచ్చటే ధ్యానము చేయ్యి అన్నారు అతను అలాగే చేశాడు, తిరిగి వచ్చాడు గురువుగారు అడిగేరు ఈ రోజు ఏమి చూశావు? అక్కడ నాకు ఒక హంస జంట కనబడినది అన్నాడు, సరే, రేపు మళ్ళీ వెళ్ళు అన్నారు, అలాగే వెళ్ళి ధ్యానము చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చేడు, గురువు గారు అడిగేరు ఈ రోజు ఏమి చూశావు? ఈ రోజు చాలా విచిత్రమైన ఘటన చూశాను ధ్యానము చేసి లేవగానే స్వర్గము నుండి ఒక రథము వచ్చింది అందులో ఇద్దరు దివ్య ఆత్మలు కూర్చున్నారు మరియు స్వర్గానికి వెళ్లిపోయారు. వారు అన్నారు చూశావా? నీ ఉపస్థితి తో వారు ఎంత లాభము పొందేరు? నీ సత్సంగము యొక్క ప్రభావము వలన మొదటి రోజు చూసిన కాకి జంట హంసలు అయ్యాయి, రెండవరోజున ఆ హంస జత వ్యక్తి రూపములో వచ్చాయి రథములో కూర్చుని స్వర్గానికి వెళ్లిపోయాయి. నీ సత్సంగము యొక్క ప్రతాపము వలనే మొదటి రోజు నువ్వు చూసిన కాకి జంట మనుషుల్లా మారి స్వర్గానికి చేరాయి, సత్సంగము యొక్క ప్రతాపము చూశావా? మనకు అనుభవాలు అవుతున్నా యా లేదా దానితో ఏమి సంబంధము లేదు. గురు మహారాజ్ శక్తి మీలో నిండుతోంది అనే నమ్మకముతో ఉండండి. ఎలాగైతే వాన పడ్డప్పుడు మీరు మనస్పూర్తిగా వెళ్ళిన లేక మీకు యిష్టము లేకుండా వెళ్ళిన మీరు ఎలాగైతే తడుస్తారో, అలాగే గురు మహారాజ్ గారి ధార ఇచ్చట ప్రవహిస్తోంది మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు అనుభవము అయిన అవక పోయిన మీలో శక్తి నిండుతూనే ఉంటుంది. మీ అవస్థలు మారుతూనే ఉంటాయి, చాలా సహజముగా మీరు ఆ అవస్థకి చేరి పోతారు ఎక్కడికయితే పెద్ద పెద్ద యోగులు కూడా చేర లేరో, క్రమము తప్పకుండా సాధన చేస్తూనే ఉండాలి, ఇందులో ఒకప్పుడు మనస్సు ఉంటుంది మరోకప్పుడు ఉండదు దీనిగురించి బాధ పడ క్కర్లేదు, మీరు కూర్చుని సాధన చేస్తూ ఉండండి. మనము మన గురు మహారాజ్ కి అర గంట సమయము కేటాయించా ము, ఆ సమయము గురు మహారాజ్ గారిది, అది మనది కాదు, అందుకు రోజూ ఆ సమయము గురు మహారాజ్ గారికి ఇస్తూ ఉండండి, ఆ అర గంటలో గురువు మీలో ప్రవేశించి మీ మనస్సు, బుద్ధి యొక్క ఆలోచనలను శుభ్ర పరుస్తారు మరియు మీరు అనుభవమూ చేస్తారు, నిన్నటివరకూ ఉన్న చెడు ఆలోచనలు ఈ నాడు తగ్గాయి, నిన్నటివరకు ఏదైతే ఉండేది కాదో, అది నిండుతోంది , అందరికొరకూ ప్రేమ గౌరవము హృదయములో నిండుతున్నాయి, ఇలాంటి అనుభవము కలుగుతుంది , అనుభవము అయినా , అవక పోయినా మీరు కూర్చుని ధ్యానము చేస్తూ ఉండండి, మీరు ఉచ్చ ఆధ్యాత్మిక అవస్థకు చేరతారు.

28/03/2022

#16 శంక నివారణ

ఈ సంసారము ఎందుకు దు:ఖమయము?

దు:ఖానికి అన్నింటికన్నముఖ్య కారణము అజ్ఞానమే. ఒక మంచి ఉదాహరణ పరమ్ భాగవత్ పండిత్ జీ మహారాజ్ వ్రాశారు– మీరు ఒక మంచి ఇల్లు కట్టించుకున్నారు, అందులో చాలా సౌకర్యాలు ఉన్నాయి fridge, cooler, AC,సోఫాసెట్, భోజనము కొరకు మంచి వ్యవస్థ ఉంది, పడుకోవడానికి మంచి పరుపులు అన్నీ ఉన్నాయి, రాత్రి మీరు అచ్చటకి వెళ్తారు ఆ సమయము లో చీకటిలో మంచము కాళ్ళకి తగులుతుంది, ఏది ఎక్కడుందో తెలియదు. దీపము వెలగగానే ఏ ఇల్లయితే చీకటితో ఉండేదో, అదే లైట్ వెలగగానే వెలుతురుతో ఆనందముగా అనిపిస్తుంది. సంసారము దు:ఖమయము కాదు ఇచ్చట ఆనందము, సుఖము ఉంది దు:ఖము లేనే లేదు. అజ్ఞానము మూలాన్నే ఈ చీకటి అంతా. పరమాత్ముడు మనకి ఒక చాలా మంచి అవకాశము ఇచ్చాడు. మీకు తెలుసున్నదే పరమాత్ముడు ఒక్కడే ఉండి అనుకున్నాడు -ఏకోహం బహుస్యామ్. ఒక్కడిని ఉంటే ఆనందము లేదు నేను అనేకములో మారిపోతాను. మనమందరమూ అందులోకే వస్తాము, మనము ఎందుకు వచ్చాము ఇక్కడకి? ఆ ఆనందాన్ని పొందడానికే , ప్రకృతితో పాటూ కలిసి ఉంటే ఆ ఆనందము దొరుకుతుంది, ఎప్పుడైతే పరమాత్ముడు మరియు ప్రకృతి కలిసిపోతారో, అప్పుడే ఆనందము, పరమానందము ఉంటుంది. ఎప్పుడైతే నేను పరమాత్ముడిని కాను నేను జీవుడిని అని అనుకుంటామో అప్పుడే అంతా దు:ఖమయము. పరమాత్ముడు ఇచ్చట ఉన్నాడు, అందుకే సంసారము సుఖమయముగా ఉంది. పరమాత్ముడు ఇక్కడ తన లీలలను చూపిస్తున్నాడు, ప్రకృతి మన కొరకు ఆనందము పంచుతోంది. అజ్ఞానము మూలంగా మనము ఇది మరిచే పోయాము. అజ్ఞానము ఏమిటి? నేను, నాది, అనేది. అరే!మనము అందరమూ, సత్సంగములో అందరితోనూ కలసి కూర్చున్నాము ఎంత ఆనందముగా ఉంది! ఇదే మనము ఒక్కరే ఉంటే ఎలాగుంటుంది? ఇలాగే ఈ సంసారము సుఖము యొక్క స్థానము, పరమాత్ముడి లీల ఇచ్చట జరుగుతోంది, అజ్ఞానము తో కూడిన కళ్ళద్దాలు మన నేత్రాలనుండి దూరమైపోతే అప్పుడు సరిగ్గా కనిపిస్తుంది, శ్రీ కృష్ణుడి వేణువు ఇప్పటికీ మ్రో గుతోంది, రాస లీల జరుగుతోంది. నా భార్య, నా పిల్లలూ ఇది ఒకటే మన పరివారము కాదు, అందరూ నావాళ్లే అనే భావము వచ్చేస్తుంది, అందరితోనూ ప్రేమ, ఎవ్వరి తోను రాగ ద్వేషాలు లేవు. అప్పుడు సంసారము ఈశావాస్యమిదం సర్వం అనిపిస్తుంది. అలాంటప్పుడు అందరితోనూ ప్రేమే ఉంటుంది దు:ఖము, అశాంతి, క్లేశము ఏమీ ఉండవు.

27/03/2022

#13 శంక నివారణ

ఢోల్ గవార్ శూద్ర పశు నారీ|

సకల్ తాడనా కే అధికారీ ||

అని రామ్ చరిత్ మానస్ యొక్క సుందర్ కాండ , లో తులసీ దాస్ జీ వ్రాశారు, దయ చేసి దీని తాత్పర్యము ఏమిటో చెప్పండి?

ఇది ఏ జాతి, ధర్మ, సంప్రదాయాలకు సంబంధించినది కాదు. మరి గవార్ ఎవరు? అంటే పల్లెటూరి వాడు ఎవరు? ఎవరిదైతే బుద్ధి సరిగ్గా పని చెయ్యాదో, ఎవరి వ్యవహారము సరిగ్గా లేదో, అతను గవార్. శూద్రుడు ఎవరు? ఎవరైతే పతితుడో, నీచ బుద్ధి కలవాడో అతడు. పశువు అంటే ఎవరిలోనైతే బుద్ధి ఉండదో. నారీ అంటే స్త్రీ అని కాదు, మనము ఏమి అంటున్నామొ అర్థముచేసుకోనిది, వీరు అందరూ ధిక్కారానికి పాత్రులు. శూద్రుడు అంటే అరే! వీడు అంటరానివాడు అని కాదు. భగవాన్ శ్రీ క్రిష్ణుడు నాలుగు వర్ణాల గురించి చేప్పేరు, ఇవి నా వలనే ఉద్భవించాయి, దీని తాత్పర్యము, ఈ నాలుగు వర్ణాలూ వేరే-వేరే ఎక్కడ నించో వచ్చాయని కాదు. ఎలాగైతే మీ శరీరము ఉందో అదులో శిరస్సు, ముఖము యొక్క భాగము బ్రాహ్మణుడు, బాహు భుజాలు క్షత్రియుడు, కడుపు వైశ్యుడు, కాళ్ళు శూద్రుడు. ఇంక మీరే చెప్పండి ఇందులోంచి మీరు ఏ భాగాన్ని తీసి పారేస్తారు? ఇవన్నీ ఒక సమగ్ర భాగము (integral part) వీటిని వేరు చెయ్య లేము. జన్మ తో ఎవరూ శూద్రులు కారు కర్మతో అవుతారు. బ్రాహ్మణ శరీరములో జన్మించి చాలా పాడు కర్మలు చేస్తూ ఉంటే , మరి అతడు ఎలాంటి బ్రాహ్మడు? బ్రహ్మలో విచరించేవాడు బ్రాహ్మణుడు. మంచి ఆలోచనలతో కూడి ఉంటే బ్రాహ్మణుడు, నిమ్న శ్రేణి ఆలోచనలు ఉంటే శూద్రుడు అని లెక్ఖ. పుట్టిన పుట్టుకతో కాదు, ఈ విభజన, కర్మ పై ఆధారబడిఉంది. మెదడు మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఒక దృష్టి ఇస్తుంది, ఎలా ప్రవర్తించాలనేది బుద్ధి యొక్క పని. భుజాలు శరీరాన్ని రక్షిస్తాయి, కడుపు యొక్క పని సంపూర్ణ శరీరానికి భరణ-పోషణ చెయ్యడము. ఉదాహరణకు ఒక మనిషి దగ్గర చాలా ధనము ఉన్నాగానీ, ఎవరికీ పెట్టక నేనే తింటాను అంటే తప్పు, మన పక్కన నిర్ధనుడు ఉంటే అతడికి పెట్టడము మన కర్తవ్యము, కడుపు తనకోసమే తినదు, శరీరము యొక్క అన్నీ భాగాలకీ పంపి, సంపూర్ణ శరీరానికి శక్తి, సుఖము కలిగిస్తుంది, ఇలాగే సమాజము ఒక సమగ్ర భాగము, (integral part) దీన్ని విభజించలేము. వీరు బ్రా హ్మలు వీరు శూద్రులు అని విభజించడము కుదరదు, ఇందులోనే ఆవశ్యకరమైనవి అన్ని భాగాలు ఉన్నాయి, ఇదే కామ సూత్రము అంటే ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఇవ్వబడినదో. అందరూ ఒకలాగే పుడతారు, ఆ జీవుడే వస్తాడు అందరిలోకి, కానీ కర్మానుసారముగా ఇవన్నీ అవుతాయి రావడానికి ఇంక వేరే మార్గము లేదు. తులసీదాస్ జీ తప్పు వ్రాయ లేదు, శూద్రుడు అంటే అత డినే అన్నారు ఎవరి కర్మలు శూద్రుడివో, ఎందుకంటే అతడిని సరిచేయాలి . ఇక్కడ నారీ అంటే నారీ (స్త్రీ) మరియు పురుషుడు ఇద్దరూ కలిసి ఏకమోతారో, ఇల్లు మీదే అయిన కానీ ఇంట్లో ఇద్దరిలోనూ మంచి ఆలోచనలు, మతభేదాలు లేకుండా ఉంటే గొడవలు రావు. ఇందుకే మతైక్యము కావాలి, స్వర్గము నరకము ఇక్కడే ఉన్నాయి, పురుషుడు మద్య పానము చేసి వస్తే, భార్య చాలా బాధ పడుతుంది ఇలాంటప్పుడు (తాడన) శిక్షింపబడే ఆధికారి ఎవరవుతారు? తాగేవాడు! భార్య కాదు కదా!!! ఆమె ఆలోచనలైతే చాలా మంచివి , స్త్రీ ఒక తల్లి , ఎంత సంవేదన, మమత స్త్రీ లో ఉంటుందో అంత పురుషుడిలో ఉండదు అలాంటి స్త్రీ ని కొడతారు. ఒక పిల్లవాడి తండ్రిలేక పోతే, ఆ తల్లి కష్టపడి ఆర్జించి ఆ పిల్లాడిని పెంచుతుంది యోగ్యుడిగా తయారు చేస్తుంది, ఈ పని తండ్రి చేయలేడు. ఈ క్షమత తల్లిలో ఉంది తండ్రిలో లేదు, మోదీజీ తల్లిని చూడండి , ఇళ్ళల్లో పని చేసి ఆర్జించి మోదీని ముత్యములా తయారు చేసింది. తల్లి జన్మ ఇస్తుంది, లాలన-పాలన చేస్తుంది మరియు జ్ఞానము ఇచ్చేదీ కూడా తల్లే. తులసీదాసజీ వినయ్ పత్రికలో సీతమ్మ తల్లి గురించి వర్ణించేరు, ఉద్భవ, స్థితి, సంహార కారిణి అని, చాలా చక్కగా వర్ణించేరు, సర్వ శ్రేయస్ ప్రదానము చేసేది అని. ఎక్కడైతే స్త్రీ చెడు చరిత్ర కలిగినదో, ఆమె (తాడనకి) శిక్షింపబడే అధికారి అవుతుంది, పురుషుడు చెడు ఆచరణ వాడైతే అతడు (తాడనకి) దండనకి అధికారి అవుతాడు . పరివారము ఇద్దరితో కలిసి నడుస్తుంది గనక ఇద్దరినీ కలిపి ఒకటిగా (as a whole) చూడవలసి వస్తుంది, స్త్రీ జాతి తో సంబంధము లేదు. ఎంత మహాన్ విదుషీలు ఈ దేశములో ఉండేవారు?

27/03/2022

#12 శంక నివారణ

ఆత్మ యొక్క స్థానము మానవ శరీరము లో ఎక్కడ ఉంది?

ఆత్మకి ఒక విశేషమైన స్థానము అనేది లేదు. ఆత్మ ప్రతి చోట ఉంది. ఉదాహరణకు ఒక ఎలెక్ట్రిక్ వైర్ (electric wire)ఉంది, దాని పై ఒక రబ్బర్ ఇన్సులేషన్ (insulation)ఉంది, లోపల రాగి తారు ఉంది అందులో కరెంట్ ఉంది, అది ఏదో ఒక స్థానములోనే లేదు, పూర్తి తారులో ప్రవహిస్తోంది. ఇలాగే ఆత్మ ఒక విశిష్టమైన స్థానములోనే లేదు, పూర్తి శరీరములోనే ఉంది. సంపూర్ణ శరీరము యొక్క సంచాలన(కదలిక) ఆత్మ ద్వారా కలుగుతుంది. మన శరీరము, ఇన్సులేషన్ అయితే ఇందులో ఉన్న వైర్ (రాగి తీగ ) ఆత్మ, ఆత్మ కొరకు శక్తి యొక్క ఆవిర్భావము (source) పరమాత్ముడు, ఇలాగ మూడు వస్తువులు ఉన్నాయి, శరీరము, ఆత్మ మరియు పరమాత్మ. పూర్తి శరీరము యొక్క సంచాలన ఆత్మ ద్వారా నే అవుతుంది. ఎప్పుడైతే ఈ శరీరము శాంత పడిపోతుందో అంటే, అందులో ప్రవహిస్తూన్న శక్తి (పరమాత్మ) వెలిపోతుంది ఆత్మ కాదు. ఎలాగైతే ఒక పెద్ద యంత్రము (machine), పనిచేస్తోంది, అది ఎలెక్ట్రిక్ వైర్ ద్వారా (power source) విద్యుత్ సరఫరా తో కనెక్టె చెయ్యబడినది, స్విచ్ ఆన్ చెయ్య గానే పని చేయడము మొదలు పెడుతుంది, పవర్ పోగానే యంత్రము ఆగి పోయింది, మరి ఇప్పుడ , ఇన్సులేషన్ , మరియు రాగి తారు అన్నీ ఉన్నాయి, పవర్ ఒకటే పోయింది, ఇలాగే మన శరీరమూ ఉంది, ఆత్మా ఉంది కానీ ఏ శక్తి అయితే వస్తుండేదో అది ఆగి పోయింది, రావడము మానేసింది, శక్తి రావకపోడము మూలాన్న ఏమైంది ఈ శరీరము ఏదైతే 70-80 ఎల్లానుండి నడుస్తూ ఉండేదో అది గంట రెండు గంటలలోనే పాడౌడము మొదలోతుంది, ఇందులోంచి ఏమిటి బైటకి వెళ్ళి పోయింది, చూడడానికి ఏ మార్పూ కనిపించడము లేదు. ఆ శక్తి బైటకి వెలిపోయింది ఏదైతే పని చేస్తూ ఉండేదో, అదే ముఖ్యమైనది. ఆత్మ సర్వత్ర ఉంది, అది ఇప్పుడూ అక్కడే ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్ గీత లో అన్నారు నేను అందరి హృదయాలలోనూ నివసిస్తాను, అలాగని కాదు, నేను ఎవరిలోనూ లేను కానీ అందరూ నాలోనే ఉన్నారు. ఎలాగైతే ఒక మహాసాగరము అందులో అలలు ఉన్నాయి. సముద్రము వల్ల అలలు ఉన్నాయి కానీ అలల తో సముద్రానికి ఏమి సంబంధము లేదు. సముద్రము అతి విశాలమైనది ఇలాగే ప్రతి ఛోటా నేను ఉన్నాను ఈవైతే అలలు వెటినైతే మనము చూస్తున్నామో , ఇలాగే ఆ ఆత్మ, పరమాత్మ అయితే ప్రతి చోటా ఉంది కానీ ఆ శక్తి వేరు.

27/03/2022

#11 శంక నివారణ

మనము ప్రకాశము యొక్క ధ్యానము చెయ్యాలా లేక

గురువు యొక్క ధ్యానము చెయ్యాలా?

గురు మహారాజ్ యొక్క ధ్యానము చేస్తున్నాను, కానీ దర్శించిన గురువు యొక్క ధ్యానము చేస్తే ఎక్కువ లాభము కలుగుతుందని విన్నాను, గురు మహారాజ్ గారిని చూడ లేదు వారి గురించి మీరు ఏమంటారు మీ అభిప్రాయము ఏమిటి?

మీరు గురుమహారాజ్ గారి స్వరూపము పై వెళ్ళకండి, వారి ప్రకాశ స్వరూపాన్ని చూడండి. ప్రకాశము అందరి కొరకూ ఒక్కటే, మీరు రాముడి ధ్యానము చేసినా, కృష్ణుడిది చేసినా లేక గురు మహారాజ్ గారిది చేసినా ఎవరిది చేసినా మీరు మీ ధ్యానాన్ని(దృష్టిని) ప్రకాశము వైపుకి పెడితే, మీరు ప్రకాశము వైపుకి వెళ్ళిపోతారు. మనము చేసేది ప్రకాశము యొక్క ధ్యానము కాదు, ప్రకాశములో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిలో చేతన ఉంది , జ్ఞానము ఉంది, ఆనందము ఉంది, ఇవి అన్నీ అందులో కలిసి ఉన్నాయి, ఆ జ్ఞానము తేజోమయము, ఆనంద మయము, జ్ఞానమయమైనది. సూర్యుడి ప్రకాశము లేక బల్బ్( bulb) యొక్క ప్రకాశము చూస్తే పనికిరాదు, కుదరదు, ఎందుకంటే వీటిలో జడత్వము ఉంది. ఏ ప్రకాశము యొక్క ధ్యానము మనము చేస్తామో అది చిన్మయమైనది, ధ్యానము చేస్తూ-చేస్తూ ముందుకి వెళ్తున్న కొద్దీ, మీలో గురువు యొక్క జ్ఞానము, ఆనందము, ప్రకాశము అన్నీ చేరుతూ ఉంటాయి. మీరు ఎంత లోతుకి దిగుతారో (depth) ఇదంతా అంతే మీలోపలకి చేరుతూ ఉంటుంది, మీ బుద్ధి, మనస్సు, అహం శాంతబడతాయి, మీరు పూర్ణశాంతిలోకి చేరతారు, అప్పుడు మీరు ఒక విచిత్రమైన ఆనందాన్ని పొందుతారు. ఎలాగైతే గాలి లేనప్పుడు దీపము యొక్క జ్యోతి తిన్నగా పైకే వెళ్తుందో, కదలదు కూడా, ఇలాగే ధ్యానము యొక్క అవస్థ(స్థితి) ఏమిటంటే అప్పుడు నేను ఎంత శాంతిలోకి చెరిపోతానంటే, కూర్చుని ఉన్నా కాళ్లలో నొప్పిగానీ, ఏ అలసట లేదు శాంతముగా ధ్యానములో కూర్చున్నాను. ఇది ధ్యానము యొక్క అవస్థ.

సాధన యొక్క క్రియ లో ఏమి చెయ్యాలని చెప్పబడుతుంది అంటే ఎదుట నుండి పరమాత్ముడి ప్రకాశము వస్తోంది అని, కానీ గురు మహారాజ్ గారి ప్రకాశము వస్తూన్నట్లుగా కనిపించదు, ఎందుకు?

మీరు ప్రకాశాన్ని చూడకండి, మనము ప్రకాశము యొక్క ధ్యానము చెయ్యము, ప్రకాశములో గురువు యొక్క జ్ఞానము, ఆనందము ఉంటుంది. ఈ సాధన ఏదైతే మనము చేస్తున్నమో దానిని మంత్రము అంటారు, మంత్రము అంటే సలహా, ఎలాగైతే మీరు ఏ గురువు నైనా నామ దానము ఇవ్వమంటారో అప్పుడు ఒక మంత్రము ఇస్తారు, ఈ మంత్రము యొక్క జపము చేస్తూ ఉంటే నేను మీ తోనే ఉంటాను, మీకు సహాయ పడతాను, మీకు ప్రగతి కల్పిస్తాను. ఇలాగే గురు మహారాజ్ గారు ఏ సాధనైతే ఇచ్చారో అది ఒక మంత్రము. ఎలాగైతే చెప్పారో అలాగే కూర్చోండి, మంత్రము యొక్క జపము ఎలా పడితే అలా చెయ్యడానికి వీలులేదు, ఏ పదము ఇచ్చారో అదే ఉండాలి, అదే ఫలిస్తుంది అప్పుడు గురువు అందులో నిండిపోతారు, మంత్రములో గురువు నిండి ఉంటారు, ఆ మంత్రములో గురువు యొక్క శక్తి నిండి ఉంటుంది. ధ్యానము యొక్క సాధన ఒక మంత్రము, దీనిలో గురుశక్తి నిండి ఉంది. ఎప్పుడైతే మనము ధ్యానానికి కూర్చుంటామొ అప్పుడు ప్రకాశము అయితే ఒక మాధ్యమము మాత్రమే. మనము కారు లో కూర్చుని ఇచ్చటనుండి ఎప్పుడైతే బయలుదేరుతామో, అప్పుడు కారు అయితే అక్కడ కి చేరడానికి ఒక మాధ్యమము, ఇలాగే ప్రకాశము కూడా గురు శక్తిని మనలోకి తీసుకు వచ్చే ఒక మాధ్యమము. గురువు యొక్క జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందడమే మన పని . రెండు పూటలా ధ్యానములో కూర్చుంటూ ఉంటే దీనిని మనము పొందుతాము.

27/03/2022

#10 శంక నివారణ

ధారణను (strong) దృఢము చేయడానికి ఏమి నియమాలు?

మన అందరమూ ఇక్కడ కూర్చున్నాము, ఈ సభ యొక్క ధ్యేయము ఏమిటంటే, మీలో మాలో ప్రత్యక్ష వార్తాలాపము కుదర కలుగుతుంది అని. ఇచ్చట ఎప్పుడైతే ప్రవచనాలు ఇవ్వబడతాయో అప్పుడు మనము ధ్యానములో ఉంటాము దానిని మనము ఎంత అనుసరించేము, ఎంత అర్థము చేసుకో కలిగామొ , ఏ శంకలు మనలో ఉన్నాయి చెప్పలేకపోతాము, చిన్న-చిన్న మాటలు ఉంటాయి, అవి ఒక శంకను నిర్మిస్తాయి, దానివలన ధ్యానములో విఘ్నము ఏర్పడుతుంది కనుక శంక యొక్క నివారణ ఆవశ్యకరము, శంక ఉన్నంతవరకూ శ్రద్ధ ఏర్పడదు. చాలా అదృష్టము వలన మంచి వక్త దొరుకుతారని శ్రీమద్ భాగవతములో ఉంది, వ్యాసుడు ఎప్పుడైతే కథ చెప్తూ ఉండేవారో అప్పుడు శిష్యుడు చాలా ప్రశ్నలు వేసే వాడు. మనస్సులో శంక వచ్చింది అడగాలి కానీ భయము గురువు కి కోపము వచ్చేస్తేనో అని, వారు అన్నారు ఇలాంటిది ఏమీ లేదు , శ్రోత మరియు వక్తా ఇద్దరూ చాలా అవసరమైనవారు. చెప్పేవారు చెప్తున్నారు కానీ మనము సరిగ్గా వినడము లేదు అర్థము చేసుకోవడము లేదు తాత్పర్యము వాటితో పాటూ మనము నడవడము లేదు, దాని వలన మన పని సరిగ్గా జరగదు, మంచి శ్రోత పరమావశ్యకరము, వక్త మాటల్ని వినాలి, అర్థము చేసుకోవాలి. ఇందుకే శంక- నివారణ అవసరము, ఆ మాటలను మన జీవితములో నిర్వర్తించడము పరమావశ్యకరము . వక్త లోఎంత జ్ఞానము ఉంది? ఇది తెలుసుకోవాలి అనే శంక వలన మనకు ఏ లాభము కలగదు. నాలోనైతే చాలా పరిమిత జ్ఞానము ఉంది, ఆవశ్యకరము ఏమిటంటే లోపలదాగి ఉన్న ఆ జ్ఞానాన్ని బైటకి తీసే ప్రయత్నము చెయ్యాలి. ఎలాగైతే ఒక ఆవు పొదుగులో పాలు నిండి ఉన్నాయి, దూడ యొక్క స్పర్శ తో ఆవు ఆ పాలను దూడ కొరకు వదిలేస్తుంది. ఇలాగే ప్రశ్న వేసేవారు కూడా చాలా తెలివైనవారు అయి ఉండాలి, అడిగే ప్రశ్నకు దాని సమాధానాన్ని అర్థము చేసుకొనేవారై ఉండాలి. భగవద్ గీతలోను ఇంకా ఉపనిషత్తులలోనూ శిష్యులు ప్రశ్నిస్తారు గురువు వాటికి సమాధానము చెప్తారు. అర్జునుడు ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు వాటికి సమాధానము చెప్తారు, ఇలాగే సమాధానము చెప్తూ- చెప్తూ ఎక్కడకి చెరిపోతారంటే కృష్ణుడు తను ఎవరని ప్రకటించేస్తారు, నేనే ఈశ్వరుడుని (పరమాత్ముడు) అని అంటారు. ఎలాగైతే ఆవులో దాగిఉన్న పాలను దూడ పైకి తీసేసుకుంటుందో అలాగే శిష్యుడు గురువు లో దాగి ఉన్న ఆ జ్ఞానాన్ని బైటకి తన ప్రశ్నల ద్వారా తీసేస్తాడు. మన అన్ని ఉపనిషత్తులలోను ఇదే ఉంది, శిష్యుడు ప్రశ్నిస్తాడు గురువు సమాధానపరుస్తారు.

ధారణ, ధ్యానము, సమాధి. గురు మహారాజ్ గారు సాధన ను మనస్సు తో మొదలు పెట్టేరు. నేను ఒక ధారణ చేస్తాను నా ముందు పరమాత్ముడు ఉన్నాడు అని, నా ఎదుట గురువు ఉన్నారని. ధారణ ఎంత దృఢముగా ఉండాలంటే అది మళ్లీ మారిపోకూడదు, ఇంకొక ఆలోచన రా కూడదు, సంత్ మహాత్ములు దీనిపై చాలా పరిశోధన చేశారు. ధారణ ఇలా ఉండ కూడదు, ఏ మనిషి ధ్యానము మనము చేస్తున్నామో, చేస్తున్నప్పుడు, ఒక మాటు వారి కళ్ళజోడు, మరొకసారి ఇంకేదో కనిపించడము లేదని. ఇందుకే గురు మహారాజ్ గారు దీని పై చాలా పరిశోధన చేశారు ధారణ ఎలాంటి వస్తువుది చేయాలంటే దాని పై మళ్ళీ ఏ ప్రశ్న రా కూడదు. ఒకటే ఆలోచన ఉండాలి, అది శాశ్వతమైనదై ఉండాలి, అందరి కొరకూ అయిఉండాలి, గురు మహారాజ్ గారు అన్నారు ప్రకాశము శాశ్వతమైనది. గురు శక్తి యొక్క మాధ్యమము ప్రకాశము, వారు (physical) స్థూల రూపము యొక్క ధ్యానము చేయించలేదు, నేను కూర్చున్నాను నా ధ్యానము చేయి అని. మీరు ఎవరినైతే నమ్ముతారో గురువు, పరమాత్ముడు, ఎవరినైనా ప్రకాశ రూపములో ధరించండి , ప్రకాశములో ఏ పరివర్తన రాదు, ఎప్పటికీ ఒకలానే ఉంటుంది, ప్రకాశములో శక్తి యొక్క ప్రవాహము ఉంది. మీరు ధ్యానము చేసినప్పుడు ఇదే చూడండి నా సమ్ముఖముగా నా పరమాత్ముడు, గురువు కూర్చున్నారు, ఎవరైతే ప్రకాశ స్వరూపులో, తేజోమయులో. శ్రీమద్ భాగవతములో కూడా ఇలాగే చెప్పబడినది. కృష్ణ పరమాత్మ తో ఉద్ధవుడు ప్రశ్నిస్తారు ధ్యానము ఎలా చేయ్యా లని. సంపూర్ణముగా ఆ విధానాన్ని చెప్పారు. ఆసనము ఎలా ఉండాలి, మనము ఎలా కూర్చోవాలి, ధ్యానము ఎలా చెయ్యాలి? ధారణ ఎలా చేయ్యాలి? వారు అన్నారు మొదటి పని అయితే మీరు నన్ను చూస్తున్నారు, నేను కూర్చున్నాను, నాది ఒక స్థూల రూపము ఉంది, కానీ ఈ స్థూల రూపాన్ని దగ్గరగా ఇమడ్చండి. అది ఎంతవరకు అంటే ముఖము ఒకటే ఉండాలి తక్కిన శరీరము ఉండకూడదు ఇంకా ముందుకి వెళ్తే ప్రకాశము ఒకటే ఉండిపోవాలి (physical) స్థూల రూపము అనేది ఏమీ ఉండకూడదు. ఎక్కడకయితే, ఏ ఆలోచన చేరలేకపోతుందో. ధారణ ఎలాంటిది ఉండాలంటే మరొక ఆలోచన రా కూడదు. ఒకటే ధారణ, ఒకటే ఆలోచనను పుచ్చుకుని మనము ధ్యానములోకి చేరతాము. రకరకాల ఆలోచనలతో ధారణ చేస్తే ఎప్పటికీ ధ్యానము కుదరదు, దానిని సూక్ష్మమాతిసూక్ష్మము చేసి చేర్చాలి, అనేకాన్ని వదిలి ఏకానికి రావాలి, ఇంకా ముందుకి వెళ్ళినప్పుడు ఒక్క ఆలోచనా ఉండదు, ధారణా ఉండదు మీరు ధ్యానములోకి ప్రవేశించిపోతారు, ధారణ ధ్యానము యొక్క ప్రథమ స్వరూపము, అన్నింటినీ కూడ్చి-కూడ్చి ఎంత తగ్గించె య్యాలంటే కేవలము ఒక ఆలోచనే నా ముందు ఉండిపోవాలి, ఆఖరుకు చేస్తూ -చేస్తూ అది కూడా ఉండకూడదు, శాంతిలోకి వెళ్లీ పోవాలి, ఇదే మనము చేయాల్సినది.

26/03/2022

9 శంక నివారణ

మనస్సుకి వ్యతిరేక వస్తువులు ప్రియము అని అర్థాత్ మనస్సు వ్యతిరేక గుణాలను సాధిస్తుందని మహర్షి పతంజలి వ్రాశారు. ఇలా ఎందుకు అవుతుంది?

సంసారములో ఉన్నప్పుడు పరమాత్ముడు జ్ఞాపకము వస్తారు, కానీ ధ్యానములో ఉన్నప్పుడు సంసారము. ఇలా ఎందుకు అవుతుంది దయ చేసి వ్యాఖ్యానించండి ?



మన శరీరము పరమాత్ముడి మరియు ప్రకృతి యొక్క మిశ్రమము, ప్రకృతి పరమాత్ముడిని ఆచ్ఛాదించేసింది. నాలో పరమాత్ముడు ఉన్నాడు కానీ నేను ఆ పరమాత్ముడిని మర్చిపోయాను. ఎందుకంటే ఎదురుకుండా ఉన్నవే కనిపిస్తున్నాయి, ఇందుకే వ్యతిరేక వస్తువులు ముందుకి వస్తున్నాయి. మనము ప్రతి రోజూ చేసే పనులు యోగస్థమై చేస్తాము, భగవాన్ శ్రీకృష్ణుడు అన్నారు – హే అర్జునా! యోగస్థ: కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ.

హే అర్జునా! యోగస్థమై పని చేయాలి, యోగస్త్యము ఎవరితో? సంసారముతో కాదు, పరమాత్ముడితో. ప్రతిరోజూ చేసే పనులు సంసారముతో యోగస్థమై చేస్తున్నాము, కానీ సాధన ఏమిటి నేర్పు తోందంటే, సమాన ధర్మమైన వస్తువులతోనే యోగము సంభవము, వ్యతిరేక గుణాల వస్తువులలో యోగము కుదరదు, సంభవము కాదు. నీళ్ళల్లో పాలు కలపండి రెండూ కలసిపోతాయి, నీళ్ళల్లో రాయి వెయ్యండి నీళ్ళు వేరే, రాయి వేరే ఉంటుంది. సమాన గుణ ధర్మమైన వస్తువులే కలిసిపోతాయి, ఈ శరీరము ప్రకృతిలో ఉంది, ఆత్మ ఈ శరీరములో ఉంది, యోగము ఎవరితో చేయాలి? పరమాత్ముడితో, అయితే ఎలా సంభవం. శరీరము తో యోగము చేస్తే కుదరదు, మనస్సుతో, బుద్ధి తో చేస్తేనూ అవదు, ఆత్మ కి తెలుసు పరమాత్మ ఏమిటో, ఆత్మ పరమాత్మతో యోగము చెయ్యాలి, మనము ధ్యానములో కూర్చున్నప్పుడు అనుభవము చేస్తాము చాలా సేపటి దాకా మనస్సు ధ్యానములోకి చేరదు ఈ మధ్యలోనే , ఒక క్షణము ఎలాంటిది వస్తుందంటే ఎప్పుడైతే మనస్సు శాంత పడిపోతుందో. తాత్పర్యము ఎప్పుడైతే మనస్సు బుద్ధి నుండి, అహం నుండి దూరమై నెమ్మదిగా ఆత్మ తో సంబంధము అయిపోయిందో. జీవుడి సంబంధము ఆత్మ తో అయిపోయింది అంటే యోగమైపోయింది అంటే ఆ పూర్ణపురుషుడితో, యోగమైపోయింది, అప్పుడు నాకు అధిక ఆనందము యొక్క అనుభవమవుతోంది . ఆ స్థితిలో ఉండి ఏ పనైనా చేస్తే ఏ బంధము ఉండదు, సంఘాన్ని వదిలేయండి అప్పుడే ఈ సంసారానికి సంబంధించిన ఏ పని చేసినా అందులో సాఫల్యము కలుగుతుంది, పని శ్రేష్ఠమైనదై ఉంటుంది. సుఖము, ముక్తి కలిగించేది, జీవితానికి శ్రేయస్సు పొందించేదై ఉంటుంది. ఇందుకే పరమాత్ముడి తో యోగస్థమై పని చేయడము ఆవశ్యకరము . యోగస్థమయ్యే సాధనే గురువుగారు ఇచ్చారు, మనస్సు బుద్ధి ,అహం నుండి దూరం అవుతూ - అవుతూ ఆ పరమాత్ముడితో కలిసిపోతాము . ఈ జీవితము ఏదైతే ఇప్పటి వరకూ ఏమీ కాదో అందులో సుగంధము నిండి పోతుంది, దేని వలనైతే లక్షల కొద్ది మనుషులు ఆకర్షితులైపోతారో . పెద్ద-పెద్ద భం డారాల్లో చూడండి అచ్చట మంచి సౌకర్యాలు కూడా ఉండవు, అయినా కానీ ఒక విశేషమైన ఆకర్షణ ఉంటుంది, దాని వలన సెలవు దొరకడము కష్టమైన,( leave without pay) జీతము లేని సెలవు అయినా, ట్రైన్ లలో జాగా దొరక్కపోయినా కష్ట పడి చేరతారు. న్యూస్ పేపర్ లో, T. V. లో ఏ ప్రచారమూ చేసే అవసరము ఉండదు. ఒక అమూల్య మైన నిధి గురు మహారాజ్ గారు మనకు ఇచ్చారు. ఈ యుగములో కూడా ఆ కృష్ణుడి యొక్క మురళి మ్రోగుతోంది చూడండి, ఎంతమంది గోపికలు ఏకత్రితమయినారో ఇలాంటిది ఇంక ఎక్కడా దొరకదు. ఏ డిమాండ్ లేదు , ఏ చందా (ధనము) అడగరు, ఆనందము ఒక్కటే ఇచ్చట దొరుకు తుంది.

Address

Dampiar Nagar
Mathura
281001

Alerts

Be the first to know and let us send you an email when GuruDarshan Ramashram Satsang, Mathura posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GuruDarshan Ramashram Satsang, Mathura:

Share